సినిమా రివ్యూ: టాక్సీవాలా – Vetagadu

సక్సెస్‌ ఎంత కాన్ఫిడెన్స్‌ ఇస్తుందో అంతే ఇన్‌సెక్యూరిటీస్‌ కూడా తెచ్చి పెడుతుంది. అందుకే చాలా మంది ఆ సక్సెస్‌ వదిలిపోతుందనే భయంతో తెలియకుండానే ఒక షెల్‌లోకి వెళ్లిపోయి బందీలైపోతారు, అల్టిమేట్‌గా ఫెయిలవుతారు. విజయ్‌ దేవరకొండకి ఆ ఇన్‌సెక్యూరిటీస్‌ లేవు. ‘ఇది నాపై వర్కవుటవుతుందా’, ‘ఇప్పుడు నేనో స్టార్‌ని కదా’ అనే డౌట్స్‌ పెట్టుకోకుండా నటుడిగా ఒక కథకి తానేమి చేయగలననేది చూస్తున్నాడు. తన పాత్ర ఎంతవరకో అంతే చేస్తున్నాడు. ‘టాక్సీవాలా’ పూర్తిగా డైరెక్టర్స్‌ ఫిలిం. కొత్త దర్శకుడు రాహుల్‌ సంక్రిత్యాన్‌ తన హీరో చేతిలో స్టీరింగ్‌ పెట్టకుండా స్టోరీనే డ్రైవ్‌ చేయనిచ్చాడు. హారర్‌ కామెడీ అనేది ఇప్పటికి ఎన్నోసార్లు విజిట్‌ చేసేసిన జోనర్‌ అయినా కానీ ‘టాక్సీవాలా’ని డీసెంట్‌ వాచ్‌ అనిపించేలా నడిపించాడు.

ఏదైనా ఉద్యోగం చేసి అన్నావదినలకి సాయపడాలని చూస్తోన్న యువకుడికి (విజయ్‌) అతని వదిన (కళ్యాణి) నగలు అమ్మి డబ్బులిస్తుంది. ఆ డబ్బుతో సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనాలని చూస్తోన్న అతనికి ఓ పాత కాంటెస్సా కారు తారసపడుతుంది. కార్‌తో పాటే గాళ్‌ఫ్రెండ్‌ (ప్రియాంక) కూడా రావడంతో హ్యాపీగా సాగిపోతున్న అతని ప్రయాణంలో ఒక కుదుపు. ఆ కారులో ఓ రహస్యముంది. అందులో ఏదో ఆత్మ వుందనే సంగతి ఆలస్యంగా తెలుస్తుంది. ఎలాగైనా ఆ ‘దెయ్యం కారు’ని వదిలించుకోవాలని చూస్తాడు. కానీ అది అతడిని వదులుతుందా? అసలు ఆ ఆత్మ ఆ కారులోకి ఎందుకొస్తుంది? ఏమి చేస్తే అది అందులోంచి వెళ్లిపోతుంది?