మోడీతో బాబు లివ్ ఇన్ రిలేషన్ షిప్..బోర్ కొట్టాడని మార్చేశాడు – Vetagadu

ఏపీ ముఖ్యమంత్రి – తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై ఎదురుదాడి చేయడంలో ముందుండే వైఎస్ ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి – ఎంపీ విజయ సాయి రెడ్డి తాజాగా మరోమారు అదే తరహాలో బాబును టార్గెట్ చేశారు. ఇటు ఆన్ లైన్ లో అటు ఆఫ్ లైన్ లో చంద్రబాబు కలవరపాటుకు గురయ్యేలా వ్యవహరించారు. చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లిన విజయ సాయి రెడ్డి ఈ సందర్భంగా సినీనటుడు – శ్రీవిద్యానికేతన్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎం.మోహన్ బాబును ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిశారు. ఇటీవల మృతి చెందిన మోహన్ బాబు తల్లి మంచు లక్ష్మమ్మ చిత్ర పటానికి నివాళులర్పించి మోహన్ బాబును పరామర్శించారు. దీంతో కలవరపాటుకు గురవడం టీడీపీ వర్గాల వంతు అయింది.