ఆ ముగ్గురి కష్టం టాక్సీవాలా – Vetagadu

ఇటు గీతా2 సంస్థ, అటు యువి సంస్థ పుల్ ఖుషీగా వున్నాయి. తాము ఇద్దరు కలిసి నిర్మించిన చిన్న సినిమా టాక్సీవాలాకు మంచి టాక్ వచ్చింది. ముగ్గురు మిత్రులు బన్నీవాస్, యువి వంశీ, డైరక్టర్ మారుతిల కష్టం ఇది. మారుతి కొత్త దర్శకుడు చెప్పిన కథ విని, తాను, తన మిత్రులు కలిసి చేయాలనుకున్న ప్రాజెక్టును వంశీకి ఇచ్చారు. ఆయన బన్నీ వాస్ ను కలుపుకున్నారు.

ముగ్గురు కలిసి చిన్న సినిమాగా, ఎప్పుడో స్టార్ట్ చేసి, ఫినిష్ చేసారు. పెట్టుబడి బన్నీవాస్, వంశీలది. మారుతిది ఐడియా, ప్లానింగ్. అయితే సాహు పనుల్లో బిజీగా వున్న వంశీ వీలు చూసుకుని, సినిమాను చూసి, తన స్టయిల్ లో కూడికలు, తీసివేతలు చేసారు. ఆ తరువాత గ్రాఫిక్స్ అప్ టు ది మార్క్ లేవని అవన్నీ సరిచేయించి, బన్నీ వాస్ చేతిలో పెట్టారు.

ఆ తరువాత సీన్ లో మారుతి ఎంటర్ అయ్యారు. ఒకటికి నాలుగుసార్లు కాపీ చెక్ చేసి, మూడుగంటలకు పైగా వున్న ఫుటేజ్ ను ఓ షేప్ కు తీసుకువచ్చారు. సెన్సారుకు ఇచ్చిన తరువాత కూడా మారుతి, బన్నీవాస్ కలిసి మళ్లీ కాపీని ఓ చెక్కుడు చెక్కారు.